21న ప్రత్యేక లోక్ అదాలత్

18-11-2026 | 05:44pm

జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య 

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : జిల్లాలో ఈ నెల 21న ప్రత్యేక లోక్ అదాలత్(Lok Adalat) నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి(District Chief Judge), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వీరయ్య పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ(District Legal Services Authority) ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయస్థానంలో బుధ వారం న్యాయవాదులతో జరిగిన సమన్వయ సమావేశంలో ప్రత్యేక లోక్ అదాల(Special Lok Adalat) గురించి చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా 21న ప్రత్యేక లోక్ అదాలత్(Special Lok Adalat)లను నిర్వహిస్తుమన్నారు.

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కేసులలో మంచిర్యాల జిల్లా 14వ స్థానంలో ఉందని, జిల్లా మొత్తంలో అన్ని కోణాల్లో చర్యలు తీసుకొని ఈ లోక్ అదాలత్ లో రాజీకి తగిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. NI Act, చెక్ బౌన్స్ కేసులలో న్యాయవాదులు తమ కేసులను కక్షిదారులతో మధ్యవర్తిత్వం చేసి కేసులను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. బెల్లంపల్లి చెన్నూరు, లక్షెట్టిపేట, మందమర్రి న్యాయస్థానాలలో కూడా ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు.  NI యాక్ట్, కేసులు కాకుండా క్రిమినల్ కేసులు, సివిల్ ధావాలు పరిష్కరిష్కరించుకోవచ్చని సూచించారు.

వివిధ న్యాయస్థానాలను పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కాంపౌండ్ కేసులను పరిష్కారానికి న్యాయవాదులు తగిన సహకారం అందించాలని, కక్షిదారులకు ఈ లోకదాలత్ గురించి వివరించి వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించి సమన్వయం, సహకారం అందించాలన్నారు. జిల్లాకు ఎస్సీ ఎస్టీ ఆక్ట్ కోర్టును, కమర్షియల్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసిందని, కోర్టుల రాకతో ఆదిలాబాద్ కు వెళ్లకుండా కమర్షియల్ కేసులు కూడా ఇక్కడనే పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఏ నిర్మల, జూనియర్ సివిల్ జడ్జిలు నిరోష, కృష్ణ తేజ, న్యాయవాదులు మంజుల, అల్లం శ్రీనివాస్, రమణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు