అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి లయన్స్ క్లబ్ ఆర్థిక సాయం

18-11-2026 | 06:52pm

నేరేడుచర్ల, నవంబర్ 18(విజయ క్రాంతి): ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన సేవాభావమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు.నేరేడుచర్ల పట్టణంలో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బుస నాగరాజుకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

క్లబ్ అధ్యక్షుడు లయన్ ఎస్.కె. యూసుఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ బట్టు మధు,చల్లా ప్రభాకర్ రెడ్డి హాజరైన సందర్భంగా వారు మాట్లాడుతూ....క్లబ్ సభ్యులందరూ తమ వంతు సహకారంతో విరాళాలు సేకరించి అందించిన ఈ ఆర్థిక సాయం నాగరాజు వైద్య ఖర్చులకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని,భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు బాల వెంకటేశ్వర్లు,మూలగుండ్ల వెంకటరెడ్డి,ఎల్‌సీఐఎఫ్ కోఆర్డినేటర్ గుండ్రెడ్డి సైదిరెడ్డి,జీఎంటీ లయన్ విశ్వనాథం,వెంకన్నగౌడ్,కొనతం ఆదిరెడ్డి, కీత కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు