కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

15-10-2026 | 08:15pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో వివిధ షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  ఎం ఆర్ పీ ఎస్ (mrps) మాదిగ రక్షణ పొలిటికల్ సమాఖ్య వ్యవస్థాపక(Madiga Rakshana Political Samakhya) అధ్యక్షులు బోస్ సిరికొండ గురువారం మంచిర్యాలలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దుర్గం క్రాంతికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని షాపింగ్ మాల్స్ లో పనిచేసే మహిళా, పురుష కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తూ యాజమాన్యాలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని కూడా లెక్కచేయకుండా వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారన్నారు.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్కర్స్ ను గంటలు తరబడి నిలుచుండబెట్టి పని చేపిస్తున్నారనీ, దీనితో కిడ్నీల ప్రాబ్లమ్స్, నడుము నొప్పులు తదితర అనేక రకాలుగా అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.

కార్మికుల ప్రాణాలతో చెలగటమాడుతున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే 8 గంటల పని దినాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని, వారంలో ఒకరోజు వర్కర్స్ కు సెలవు దినం ప్రకటించాలని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి మహిళ వర్కర్స్ కుటుంబాలను షాపింగ్ మాల్స్ యజమాన్యాలు ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు