టచ్ రగ్బీలో శ్రీచైతన్య జోరు
మంచిర్యాల క్రైమ్ (విజయక్రాంతి): అస్మిత ఖేలో ఇండియా టచ్ రగ్బీ జోనల్ స్థాయి పోటీల్లో మంచిర్యాల గోదావరి రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థినులు(Sri Chaitanya School students) ప్రతిభ చాటారు. పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి సత్తా చాటారు. శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(School Headmaster) ఈశ్వరచరణ్ తెలిపారు.
విజేతలుగా నిలిచిన విద్యార్థినులను, వారికి శిక్షణ అందించిన పీఈటీలు రాజేందర్, కుమార్, అక్షయ్, కుమార్, రేఖ తదితర ఉపాధ్యాయులను పాఠశాల చైర్మన్, డైరెక్టర్ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో విద్యార్థినులు సాధించిన విజయాలు పాఠశాలకు గర్వకారణమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం అంచిందర్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు, డీన్ సాంప్సన్, ఏఓ విలాస్, జోనల్ పీఈటీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.