రైతన్నకు భరోసా.. ధాన్యం కొనుగోళ్లు షురూ!

30-10-2026 | 11:46am

గంభీరావుపేట, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centres) సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని ఏఎంసీ చైర్మన్ హమీద్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని సముద్ర లింగాపూర్, గోరంటాల, గజసింగవరం, మల్లుపల్లె, లక్ష్మీపూర్, దమ్మన్నపేట గ్రామాల్లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైన మౌలిక సదుపాయాలు (Basic Facilities) కల్పించి ధాన్యం సేకరణ (Paddy Procurement) సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వేశాల వెంకటి, తహసీల్దార్ మారుతీ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీరావు, పర్శ హన్మాండ్లు, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మేడ భాస్కర్, ఆయా గ్రామాల సర్పంచులు ఉమ్మారెడ్డి విమల, చంద్రశేఖర్ రెడ్డి, ఎర్రం లతిక, గంగ సాయవ్వ, బొల్లు సత్తయ్య, అంజయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు