బైక్ అదుపుతప్పి మేస్త్రికి తీవ్ర గాయాలు!
30-10-2026 | 11:36am
కాగజ్‌నగర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం(Kagaznagar Mandal)లోని విలేజ్ నంబర్ 5కు చెందిన సెంట్రింగ్ మేస్త్రి భుర్జాన్ మండల్ రోడ్డు ప్రమాదం(Road accident)లో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం సెంట్రింగ్ పనుల నిమిత్తం మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో అతని తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బంధువులు వెంటనే అతడిని కాగజ్‌నగర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.