రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Telangana Social Welfare Gurukul School) సెంట్రల్ ఎక్సలెన్స్ విద్యార్థులు అండర్ 19 సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బి. వినయ్ కుమార్ సెకండ్ ఎంపీసీ, ఆర్. ప్రణవ్ సెకండ్ ఎంపీసీ, టి.రాజేష్ ఫస్ట్ బైపిసి, వి. విగ్నేష్ ఫస్ట్ బైపిసి, కే .సిద్ధార్థ ఫస్ట్ ఎంపీసీ విద్యార్థులు అక్టోబర్ ఒకటవ తేదీన బెల్లంపల్లి జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు.
కళాశాల ప్రిన్సిపాల్ అఖిల విజయ సాగర్, వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి కమలాకర్ మల్లికార్జున్ అఖిల్, జ్యోతి మేడం శివ తేజస్విని విద్యార్థులను అభినందించారు. ఈనెల ఆరో తారీకు నుంచి 8 వ తారీకు వరకు భవాని శ్రీ అరబిందో జూనియర్ కాలేజ్ సైనిక్‌పురి సికింద్రాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగు తాయని ఉమ్మడి ఆదిలాబాద్ అండర్ 19 కార్యదర్శి బి బాబు రావు తెలిపారు.
మంచిర్యాల జిల్లా డిఐఈఓ అంజయ్య రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి మంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ పాల్గొన్నారు.