ఎన్నికల ప్రక్రియపై జ్ఞానం అవసరం
తహశీల్దార్ రఫతుల్ల హుస్సేన్
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై పూర్తిస్థాయి జ్ఞానం అవసరమని మంచిర్యాల తహశీల్దార్ రఫతుల్లా హుస్సేన్(Tahsildar Rafatullah Hussain) అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు 'ఎన్నికల ప్రాముఖ్యత' అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎన్నికల ప్రక్రియ పట్ల, ఓటరు జాబితా తయారీ పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
బలమైన దేశం, బలమైన ప్రజాస్వామ్యంతోనే సాధ్యమని, బలమైన ప్రజాస్వామ్యం ఎన్నికలతోనే వస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్వల్ యెల్మే, డిప్యూటీ తహశీల్దార్ వరలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్ కుమార్, కళాశాల అధ్యాపకులు (రాజనీతి శాస్త్ర) డాక్టర్ షఫీయొద్దిన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.