కారును తప్పించబోయి.. ఆర్మీ వాహనం బోల్తా!
- డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిన సైనికుల వాహనం
- హవల్దార్‌కు తీవ్ర గాయాలు.. పలువురు జవాన్లకు స్వల్ప గాయాలు
- గోల్కొండ ఆర్మీ ఆసుపత్రికి తరలింపు
చేవెళ్ల, నవంబర్ 13 (విజయక్రాంతి): చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామ రెవెన్యూ(Allavada Village Revenue) పరిధిలో శుక్రవారం ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన ఆర్మీ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న హవల్దార్ అవిందర్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో పది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
ప్రమాదంలో గాయపడిన జవాన్లను తొలుత షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గోల్కొండలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. గాయపడిన వారిలో మల్లప్ప, విశ్వనాథ్, రాజీవ్, అర్జుప్ప, జీవన్, జీత్వాస్, పరస్, అశ్విన్, నిద్ధిమ్, సూరజ్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జవాన్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.