ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

27-11-2026 | 05:02pm

చేగుంట నవంబర్ 27, విజయక్రాంతి : చేగుంట మండలం(Chegunta Mandal) బోనాల కొండాపూర్ గ్రామంలో సర్పంచ్ రంగయ్య, రామకృష్ణారెడ్డి, రాజిరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ(Ayyappa Swamy Maha Padipooja) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో(Devotional) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Dubbak MLA Kotha Prabhakar Reddy), నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మహా పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు