ఇందిరమ్మ భీమా నమోదు 100 శాతం పూర్తి చేయాలి

27-11-2026 | 07:25pm

డిసెంబర్ 17లోగా లక్ష్యాన్ని చేరుకోవాలి: ఎంపీడీవో మహేశ్వరరావు 

నాగల్‌గిద్ద, నవంబర్ 27 : నాగల్ గిద్ద మండల పరిషత్ కార్యాలయంలో(Nagal Gidda Mandal Parishad Office) ఎంపీడీవో మహేశ్వరరావు, ఏపీఓ మురళి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో(Village Panchayat Secretaries) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహేశ్వరరావు మాట్లాడుతూ రేషన్ కార్డులు(Ration Cards) కలిగిన అర్హులైన లబ్ధిదారులందరికీ(Beneficiary) ఇందిరమ్మ భీమా నమోదు(Indiramma Insurance Registration) చేయాలని, డిసెంబర్ 17వ తేదీలోగా వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే బీవీజీ రామ్‌జీ పథకం(BVG Ramji Scheme) కింద మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామానికి 30 ఇంకుడు గుంతలు, రెండు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, ఒక డ్రైన్ ఎండ్ పాయింట్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించేలా ప్రజలకు అవగాహన కల్పించి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో మహేశ్వరరావు, ఏపీఓ మురళి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, బీవీజీ రామ్‌జీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు