గిరిజన రైతులకు మినుము విత్తనాల పంపిణీ

26-11-2026 | 10:46pm

40 మంది రైతులకు పి.యు.-31 రకం విత్తనాలు అందజేత

చివ్వెంల, నవంబర్ 26 (విజయక్రాంతి): గిరిజన రైతుల(Tribal farmers) ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ ఆదాయం పెంపే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) గడ్డిపల్లి ఆధ్వర్యంలో గురువారం చివ్వెంల రైతు వేదికలో గిరిజన రైతులకు మినుము విత్తనాలు పంపిణీ చేశారు. గిరిజన కులాల ఉప ప్రణాళిక (టీఎస్‌పీ)లో భాగంగా 40 మంది రైతులకు ఒక్కొక్కరికి 8 కిలోల చొప్పున మొత్తం 320 కిలోల పి.యు.-31 రకం విత్తనాలను అందజేశారు.

ఈ సందర్భంగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి. నరేష్ మాట్లాడుతూ.. సమీకృత వ్యవసాయ విధానాలతో రైతులు ఆదాయం పెంచుకోవచ్చని తెలిపారు. శాస్త్రవేత్త అరిగెల కిరణ్ మాట్లాడుతూ.. మినుము సాగు పద్ధతులు, విత్తన మోతాదు, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.

మరిన్ని వార్తలు