క్రైస్తవ మహిళలపై దాడిని ఖండిస్తున్నాం

04-11-2026 | 06:47pm

బీఎస్పీ మండల అధ్యక్షులు భానుచందర్

చేగుంట నవంబర్ 04,విజయక్రాంతి: క్రైస్తవ మహిళలలు(Christian women),  చర్చికి వెళుతున్న సమయంలో మత ఉన్మాది దాడి చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే అతని అరెస్టు చేయాలని బీఎస్పి చేగుంట(BSP Chegunta)  మండల అధ్యక్షులు టప్ప భానుచందర్(Tappa Bhanuchander) డిమాండ్ చేశారు.

బుధవారం చేగుంట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో దేశంలో అన్ని మతాలు, సమానమని ఏ వ్యక్తి అయినా, అతని ఇష్టం ఉన్న మతాన్ని పాటిస్తారని ఒక మతసామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని, బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని వారు అన్నారు..

మరిన్ని వార్తలు