నార్సింగిలో డీపీఓ యాదయ్య ఆకస్మిక పర్యటన
పాపన్నపేట,అక్టోబర్07: మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) యాదయ్య బుధవారం పర్యటించారు. డ్రైనేజీ, వీధి దీపాలు, త్రాగునీటిని పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించేలా చూడాలని గ్రామ సర్పంచ్ మల్లేశం, పంచాయతీ కార్యదర్శి వెంకటేశంను ఆదేశించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం పని వద్దకు వెళ్లి కూలీలకు పని వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పని వద్ద నీడ లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని, త్రాగడానికి వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. కూలీలకు కావలసిన టెంట్, వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయమని గ్రామ సర్పంచ్, సెక్రటరీకి ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ ధారబోయిన మల్లేశం, ఉప సర్పంచ్ నరేష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, వార్డు సభ్యులు తదితరులున్నారు.