సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

07-10-2026 | 05:10pm

యాదాద్రి భువనగిరి: బీబీనగర్(Bibinagar) సమీపంలో సిర్పూర్-కాగజ్‌నగర్ రైలు(Sirpur Kagaznagar Train)లో బుధవారం పొగలు, మంటలు కనిపించడంతో కొద్దిసేపు కలకలం రేగింది. రైలు సికింద్రాబాద్ నుంచి సిర్పూర్-కాగజ్‌నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం.. రైలులోని బ్రేక్ లైనర్ చక్రానికి రాపిడి చెందడంతో వేడి పెరిగి పొగలు, మంటలు(Train Fire) చెలరేగినట్లు తెలుస్తోంది. దీనిని కో-పైలట్ గుర్తించి వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి: దసరా సర్‌ప్రైజ్..బస్సే మీ ఇంటి ముందుకు!


అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న తాజా వివరాల ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం నమోదుకాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, రైలు రాకపోకలపై ప్రభావం తదితర సమాచారం తెలియాల్సి ఉంది.


మరిన్ని వార్తలు