ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-19 వాలీబాల్ జట్టుకు..

07-10-2026 | 05:53pm

- టీజీఎంఎస్ మంచిర్యాల విద్యార్థుల ఎంపిక

మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా SGF అండర్-19 వాలీబాల్(Volleyball Team) జోనల్ మీట్‌లో టీజీఎంఎస్ మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు టీజీఎంఎస్ మంచిర్యాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న బుధవారం తెలిపారు. బాలికల ఎంపిక పోటీలు టీజీఎంఎస్ మంచిర్యాలలో, బాలుర ఎంపికలు కాసిపేట గురుకులంలో నిర్వహించగా టీజీఎంఎస్ మంచిర్యాలకు చెందిన ఎం. రుచిత (ప్రథమ సంవత్సరం CEC), ఎస్. సాత్విక ( ద్వితీయ సంవత్సరం BiPC), సాయి ప్రదీప్ ( ద్వితీయ సంవత్సరం CEC) విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-19 వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్లు వెల్లడించారు.

ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు రంగారెడ్డిగూడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అండర్-19 వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను టీజీఎంఎస్ మంచిర్యాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్నతో పాటు పీడీ ఎన్. సుదీప్, DIEO అంజయ్య, SGF U-19 సెక్రటరీ బాబురావులు అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు