ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 వెంటనే ఇవ్వాలి
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ
సత్తుపల్లి. అక్టోబర్ 7. ( విజయ క్రాంతి ): రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రకటించిన విధంగా ఆటో కార్మికులందరికీ సంవత్సరానికి 12000 రూపాయలు వెంటనే ఇచ్చి ఆటో కార్మికులు(Auto-rickshaw drivers) నాదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ(CPI leader Dandu Adinarayana) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మెట్ట ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో కార్మికులు కనీస అవసరాలు తీరక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 12000 రూపాయలు వెంటనే ఇవ్వాలని అదేవిధంగా ఉచిత ఇన్సూరెన్స్కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్కే సౌ కత్ శ్రీను యాకూబ్ మురళి కృష్ణ కేశవరావు రాంబాబు సత్యనారాయణ వెంకట్ నారాయణ రవి కిరణ్ ప్రసాద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు