16వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్లు
బోథ్. అక్టోబర్ 7 (విజయ క్రాంతి): వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను 16 ఆర్థిక సంఘం నిధులు(Finance Commission Funds) రావడం జరిగింది. అయితే ఆ నిధులకు సంబంధించిన నూతన అకౌంట్లు బుధవారం తెరిపించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ ల జాయింట్ చెక్ పవర్ తో కూడిన అకౌంట్ ను తీశారు.
సోనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచులు ఉప సర్పంచ్లు గ్రామ కార్యదర్శుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో రత్నాకర్ రావు మాట్లాడారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంతేగాక గ్రామాల సర్పంచులు కార్యదర్శిలు ఉపసర్పంచులు వార్డు సభ్యులు ముందుండి వేసవికాలంలో కూలీలకు పని కల్పించే విధంగా పనులను చేపట్టాలని కోరారు. ఇంకుడు గుంతలను ఇంటింటికి నిర్మించుకునే విధంగా గ్రామస్తులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు కార్యదర్శులు పాల్గొన్నారు.