వేడెక్కిన ఆర్టీసీ ఎన్నికల ప్రచారం

07-10-2026 | 05:51pm

నిర్మల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): టిజిఎస్ఆర్టీసీ(TGSRTC)లో పదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలకు పోటాపోటీగా ప్రచారం జరుగుతుంది. ఈనెల 9 జిల్లా పరిధిలోని ఆరు డిపోల్లో గుర్తింపు సంఘం కోసం ఎన్నికలను కార్మిక శాఖ నిర్వహించనుంది. ఉండగా నిర్మల్ బైంసా డిపో పరిధిలో రెండు కార్మిక సంఘాల మధ్య పోటాపోటీ నెలకొంది.

ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని రాజకీయ నాయకులతో ప్రచారం చేస్తుండగా, ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, సమస్యల పరిష్కారమే యజెండాగా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ డ్రైవర్ ఆర్టిసి సిబ్బందికి కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిచ్చెన బస్సు గుర్తుకు ఓటు వేయాలని మహాకూటమి నేతలు గంగాధర్ గౌడ్ కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి కార్మికులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు