వీబీజీ రాంజీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
దామరచర్ల ;అక్టోబర్ :7 దామరచర్ల మండలం లోని బాలాజీ నగర్ తండ గ్రామపంచాయతీలో వీబీజీ రాంజీ పథకం(VBG Ramji Scheme) కింద చేస్తున్న పనులను ఎంపీడీఓ వెంకటయ్య బుధవారం పరిశీలించారు.ఈ పథకం ద్వారా చేపడుతున్న ఫారం పాండు పనులను ఆయన సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.
సందర్భంగా ఎంపీడీవో వెంకటయ్య మాట్లాడుతూ, వీబీజీ రాంజీ పథకాన్ని ఉపాధి హామీ కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు, వర్షపు నీటిని నిల్వ చేసే గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామంలో పారిశుద్ధ్యం, భూగర్భ జలాల సంరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న పనులను నాణ్యతతో, నిర్ణీత ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.అనంతరం వాంకుడోత్ తండ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులు, అందుబాటులో ఉన్న సరుకులను పరిశీలించి, కేంద్రం నిర్వహణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో నాగేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ శంకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సావిత్రి , సర్పంచ్ రాధ రమణ, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.