సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటాలు చేసింది
బీఆర్ఎస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్..
నేరేడుచర్ల, అక్టోబర్ 07 (విజయక్రాంతి): గత ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతులు పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసిందని హుజుర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్(BRS Leader Rapolu Naveen Kumar) అన్నారు.
నేరేడుచర్లలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడంలో భాగంగా గ్రాడ్యుయేట్ ను కలిసి ఫాం 18 అందజేసిన సందర్బంగా అయన మాట్లాడుతూ... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు అవ్వాలని, సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు భిన్నమైనదని, సమాజానికి మార్గదర్శకంగా నిలిచే పట్టభద్రులు వేసే ఓటు కాబట్టి ప్రతి పట్టభద్రుడు తమ విలువైన ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు పెరుమాళ్ళ సతీష్ కుమార్ అరే శ్రీకాంత్ పత్తిపాటి రమేష్ బోస్ సంధ్య గీత నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు.