సమానత్వానికి ప్రతీక అంబేద్కర్

29-11-2026 | 06:12pm

ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అంకం శ్యామ్

ఘట్ కేసర్, నవంబర్ 29 (విజయక్రాంతి) : ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్(Prabuddha Bharata International) ఆధ్వర్యంలో అంబేద్కర్(Ambedkar) ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో(Ghatkesar town) 294వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అంకం శ్యామ్(Ankam Shyam, ABVP State Joint Secretary) విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Bharat Ratna Dr. B. R. Ambedkar) తన అపారమైన జ్ఞానంతో ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు.

కోట్లాది భారతీయులకు సమాన హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించే భారత రాజ్యాంగ రూపశిల్పిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. అవమానాల నుంచి ఆత్మగౌరవం వైపు, వివక్ష నుంచి సమానత్వం వైపు, ఒక బాలుడి ప్రయాణం యావత్ భారతదేశానికి మార్గదర్శకమైందని తెలియజేశారు.

ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమం లో మేకల దాస్, కాలేరు రామోజీ, మారం లక్ష్మా రెడ్డి, మంగు శ్రీనివాసరావు, అంకం సురేష్ యాదవ్, కే.నర్సింగ్ రావు, కె.సత్యం, కడప బిక్షపతి, బండారి రాందాస్, మీసాల రాజేష్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు