మాదకద్రవ్యాల నిర్మూలనపై స్వచ్ఛంద అవగాహన కార్యక్రమం

29-11-2026 | 06:09pm

కల్లూరు. నవంబర్ 29. ( విజయక్రాంతి ): ఖమ్మం జిల్లా(Khammam District) కల్లూరు లో చెన్నూరు ప్రభుత్వ పాఠశాల(Chennur Government School) ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్(Teacher Dantala Sudhakar) డ్రగ్స్ వాడకం(Drug use) డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే అనర్ధాలు గురించి బైక్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పట్నంలోని పలు ప్రాంతాల్లో బైక్ కు ఫ్లెక్స్ లు కట్టుకొని మైక్ ద్వారా వివరిస్తూ నేటి సమాజంలో ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం(Drug use) ఒక పెద్ద సమస్యగా మారుతుందని గంజాయి, కోకైన్, హెరాయిన్(Cannabis, cocaine, heroin) వంటి మత్తు పదార్థాలతో పాటు ఇతర మాదక ద్రవ్యాలకు కూడా కొంతమంది యువత బానిసలు అవుతున్నారని పల్లె ప్రాంతాల్లో కూడా ఈ సంస్కృతి పెరిగిపోతుందని చెడు స్నేహాలు సరదా కోసం ప్రయత్నించడం.

ఒత్తిడి తెలియకపోవడం వంటి కారణాలతో యువత ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతుందని ముఖ్యంగా గంజాయి వాడకం పెరుగుతుందని తెలియజేస్తూ మనందరం ఇలా డ్రగ్స్ పాలైనటువంటి యువతను మంచి మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలిపారు. డ్రగ్స్ అనేవి ఒక వ్యక్తిని మాత్రమే కాదు ఒక కుటుంబాన్ని ఒక సమాజాన్ని కూడా నాశనం చేసే ఒక ప్రమాదకరమైనటువంటి అలవాటు అని యువత సరదా కోసం కూడా ఒక్కసారి కూడా డ్రగ్స్వాడకాన్ని ప్రయత్నించవద్దు.

మీ జీవితాన్ని మీ తల్లిదండ్రుల ఆశలను మీ కుటుంబ సభ్యుల ఆనందాన్ని చెడగొట్టుకోవద్దు. డ్రగ్స్ అమ్మేవారిని,సరఫరా చేసే వారిని ప్రోత్సహించకుండా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, మత్తుకు బానిస అయిన వారిని చిన్నచూపు చూడకుండా చికిత్స పొందేలా సహకరించి మళ్లీ వారిని మంచి మార్గంలోకి తీసుకురావాలని కోరారు.

డ్రగ్స్ రహిత  సమాజం నిర్మించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేయడం జరిగింది డ్రగ్స్ వద్దు -చదువే ముద్దు. మత్తు పదార్థాలకు నో- ఆరోగ్యకరమైన జీవితానికి ఎస్. మన ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం డ్రగ్స్ రహితంగా మార్చడానికి మన్మందరం సహకరించాలని కోరుతూ ప్రజలను, యువతను చైతన్య పరిచారు.

... దంతాల సుధాకర్, ph :9440062504

మరిన్ని వార్తలు