అందెశ్రీ ఆశయాల సాధనకు యువత పునరంకితం కావాలి
ఆయన సాహిత్య స్ఫూర్తి కలకాలం చిరస్థాయి
పర్యావరణవేత్త, సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం
ఘనంగా ప్రజా కవి వర్ధంతి
ఘట్‌కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ మట్టి మనిషి, అక్షర యోధుడు, ప్రజా కవి అందెశ్రీ(Ande Sri) ఆశయాల సాధనే లక్ష్యంగా యువత నిరంతరం ముందుకు సాగాలని పర్యావరణ వేత్త, సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం పిలుపునిచ్చారు. మంగళవారం ఘట్‌కేసర్ పట్టణంలోని అందెశ్రీ స్మారక ఘాట్ వద్ద ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ నేల విముక్తి కోసం, సాంస్కృతిక జాగృతి కోసం తన కలం, గళాన్ని ఆయుధాలుగా మలిచిన గొప్ప దార్శనికుడు అందెశ్రీ అని కొనియాడారు. తన పాటలతో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఉద్యమ జ్వాలలు రగిల్చారని, ఆయన సాహిత్యం నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సహజసిద్ధమైన కవిత్వంతో ప్రకృతిని, మానవీయ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఆయన ఆలోచనలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ సామాజిక వేత్త జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్, వినయ్‌తో పాటు పలువురు నాయకులు, అందేశ్రీ అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కవికి ఘన నివాళులు అర్పించారు.