చెత్త డంపింగ్ యార్డ్ దుర్గంధం
- ప్రజల జీవనశైలిపై ప్రభావం
- అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్న వైనం
- మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు
ఘట్ కేసర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ఘట్‌కేసర్ డివిజన్(Ghakesar division) పరిధిలోని కొండాపూ ర్ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డు(Garbage dumping yard) ప్రజల ప్రశాంతతను పూర్తిగా ఊడ్చేసింది. ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణంతో అలరారిన ఆ ప్రాంతం ఇప్పుడు దుర్గంధానికి నిలయంగా మారింది. ఘ ట్ కేసర్, ఎదులాబాద్ డివిజన్‌ల ప్రాంతాల నుండి రోజు వందల టన్నుల చెత్తను ట్రా క్టర్, లారీల్లో తెచ్చి పోస్తుంటే, కొండంత పేరుకుపోయిన ఆ చెత్తకుప్పల నుంచి వచ్చే కంపు గాలి మైళ్ల దూరం వరకు వ్యాపిస్తోంది.
ఆరోగ్య సమస్యలు..
చెత్తపై వాలే ఈగలు, దోమల వల్ల డెం గ్యూ, మలేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. చిన్న పి ల్లలు, వృద్ధులు తరచూ శ్వాసకోశ (ఆస్తమా) సంబంధిత సమస్యలతో ఆసుపత్రు ల పాలవుతున్నారు. తీ వ్రమైన శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరితే వైద్యులు చెత్త నుండి వచ్చే దుర్గంధం, కాల్చి న పొగ వాసనలతో ఈ కలుషిత వాతావర ణం వల్లనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు చెబుతున్నారు.
తాగునీటి కాలుష్యం..
వర్షాకాలంలో డంపింగ్ యార్డులోని కుళ్లిన చెత్త నీరు భూమిలోకి ఇంకిపోయి, చుట్టుపక్కల ఉన్న బోరు బావులు, భూగర్భ జలాలను విషతుల్యం చేస్తోంది. ఆ నీరు తాగడానికి కాదు కదా, కనీసం వాడుకోవడానికి కూడా పనికిరాకుండా పోయింది.
దుర్గంధం జీవనశైలిపై ప్రభావం..
గాలులు వీచిన సమయంలో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తలుపులు తీసే పరిస్థితి లేదు. బంధువులను ఇంటికి పిలవాలన్నా, ఇళ్లలో ఏ చిన్న శుభకార్యం తలపెట్టాలన్నా స్థానికులు వెనుకాడా ల్సి వస్తోంది.
వ్యవసాయంపై దెబ్బ..
చెత్త కుప్పల నుండి గాలికి కొట్టుకువచ్చే ప్లాస్టిక్ కవర్లు పొలాల నిండా పేరుకుపోతున్నాయి. దీనివల్ల నేల సారం తగ్గిపోయి పంట దిగుబడి ఘోరంగా పడిపోతోంది. పొలాల్లో మేసే పశువులు ప్లాస్టిక్ తిని అనారోగ్యం పాలవుతున్నాయి.
మొరపెట్టుకున్న కనుకరించని అధికారులు..
చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు సమయం లో కొండాపూర్ ప్రజలు వ్యతిరేకించి పోరా డి అధికారులకు వినతులు అందజేశారు. అయినా అధికారులు తొలగిస్తామని మా యమాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి ఇచ్చిన స్వచ్ఛమైన గాలి, నీరు మనుషుల హక్కు అని డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలైన కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సి నగర్, మున్సాని సింగరేణి కాలనీల ప్రజలు తమ ప్రాంతాన్ని, ఆరోగ్యాలను కాపాడుకోవడానికి పడు తున్న ఆవేదన మన నగర వ్యర్థాల నిర్వహణ విధానాలపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
ఇప్పటికయినా తొలగించాలి..
ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా డంపింగ్ యార్డ్‌ను జననివాసాల సమీపం నుంచి మరికొంత దూరం వైపు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.