రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గుండ్ల వెంకటేశ్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): సమగ్ర సమీక్ష, సీనియర్ నాయకుల సలహాల మేరకు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర కార్మిక విభాగం శిక్షణ నైపుణ్యాభివృద్ది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఘట్ కేసర్ పట్టణానికి చెందిన గుండ్ల వెంకటేష్ నియమితులయ్యారు. ఈ మేరకు కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్(State Convener Ande Srinivas) చేతుల మీదుగా గుండ్ల వెంకటేష్ నియామకపు పత్రాన్ని అందుకున్నారు.
పార్టీ సిద్దాంతాలపట్ల, సమాజం పట్ల వారికున్న నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థవంతమైన సేవలను గుర్తించి రాష్ట్ర కార్మిక విభాగం శిక్షణ నైపుణ్యాభివృద్ది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా గుండ్ల వెంకటేష్ ను నియమించడం జరిగిందని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తూ, కార్మికుల సంక్షేమానికి, సంస్థ బలోపేతానికి మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.