ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే ఆత్మసంతృప్తి

15-10-2026 | 08:05pm

డయాలసిస్ బాధితునికి మాజీ డిప్యూటీ మేయర్ ఆర్థిక చేయూత

జవహర్ నగర్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని చంద్రపురి   కాలనీలో నివాసం ఉంటూ డయాలసిస్ తో బాధపడుతున్న సండం సాయికుమార్ కు తన వంతు సహాయంగా మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాయికుమార్ పరిస్థితిని తెలుసుకున్న వెంటనే స్పందించిన శ్రీనివాస్ గుప్తా నేరుగా అతని ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందించడంతో పాటు ధైర్యం చెప్పారు. వైద్యానికి ఎలాంటి సహాయం కావాలన్నా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సాయికుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కృష్ణ బాబా, శ్రీమన్నారాయణ, మాధవ్, శ్రీనివాస్ గౌడ్, సవిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు