మౌలిక వసతులకు తెలంగాణ సర్కార్ పెద్దపీట

18-11-2026 | 07:21pm

జవహర్ నగర్ డివిజన్ 3 సంతోష్ నగర్ లో సిసి రోడ్డు నిర్మాణ పనులు.                                

జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్.                        

జవహర్ నగర్, నవంబర్ 18 (విజయక్రాంతి): మౌలిక సదుపాయాల(Infrastructure) కల్పనే తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) యొక్క ముఖ్య లక్ష్యమని అభివృద్ధి పనులలో(development works) తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రమైందని జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ 3 సంతోష్ నగర్ లో కాలనీ అభివృద్ధియే ధ్యేయంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో బుధవారం సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రతి కాలనీలో రోడ్లు డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాట్ల వినయ్, ప్రధాన కార్యదర్శి డి ఎస్ ఎస్ వెంకటేశ్వర్లు, విజయరాయి, యువజన అధ్యక్షులు సోమేశ్చారి, వీర్ల భుజంగం ,రాజు యాదవ్, గజ్వేల్ శంకర్, రఫిక్, అజయ్, మధు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు