23 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కారణామిదే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే డీలిమిటేషన్(Delimitation)పై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23, 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు(Parliament special sessions) నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ స్థానాల(Lok Sabha Seats)ను 850కి పెంచే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. అయితే బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావడంతో విపక్షాల మద్దతు కీలకంగా మారింది. మరోవైపు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సీట్ల వాటాను కాపాడే కొత్త ఫార్ములాపై కేంద్రం చర్చిస్తున్నట్లు సమాచారం.