హీరోస్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్
టీవోటీ ఆధ్వర్యంలో 60 మందికి ప్రదానం
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబ రుస్తూ సమాజానికి, నగర అభివృద్ధికి(Urban Development) సేవలందిస్తున్న 60 మందికి పైగా ప్రతిభావం తులకు ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్’(Heroes of Hyderabad Awards) ప్రదానం చేశారు. ట్రయంఫ్స్ ఆఫ్ టాలెంట్ (టీఓటీ) ఆధ్వర్యంలో మూడో ఎడిషన్ అవార్డుల వేడుకను నవంబర్ 27న కోకాపేట లోని తవారో రిసార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్, సాంకేతిక, వైద్య, పారిశ్రామిక, విద్యా, కళలు, సామాజిక సేవా రంగాలకు చెందిన 300 మందికి పైగా ప్ర ముఖులు హాజరయ్యారు.
మొత్తం 11 విభాగాల్లో అవార్డులు అందజేశారు. ముఖ్య అతి థులుగా తెలంగాణ శాసనమండలి సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, సీబీఆర్ఈ మేనేజింగ్ డైరెక్టర్ సురోదీప్ చౌధురి, ఓక్వుడ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ పాల్గొన్నారు. ప్రముఖ శిశు వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్, స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ చరణ్ లక్కరాజు, ఈహామ్ వ్యవస్థాపకుడు మురళి బుక్కపట్నం, ర్యాన్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెం ట్ అనురాగ్ గార్గ్, సౌరభ్ బాలి, నరనే గుండబతుల అవార్డులు అందుకున్నారు.
పారా అథ్లెట్ వేణు వినుకొటి, యువ సాంకేతిక పారిశ్రామికవేత్త కియాన్, వర్ధమాన్ జైన్, కూచిపూడి నృత్యకారిణి నీలింప నిసర్గ కూడా పురస్కారాలు పొందారు. 2023లో పారిశ్రామికవేత్త మహమ్మద్ ఫయాజ్ స్థా పించిన ట్రయంఫ్స్ ఆఫ్ టాలెంట్ సంస్థ నిష్పక్షపాతంగా ప్రతిభను గుర్తించడం లక్ష్యం గా పనిచేస్తోంది. సంస్థ వేదికల ద్వారా ఏటా 14 వేలకుపైగా నామినేషన్లు అందుతున్నా యి. మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంతోమందికి కలలను సాకా రం చేసుకునేందుకు, వ్యాపారాలను అభివృ ద్ధి చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తోందన్నారు. నగర అభివృద్ధికి, సమాజ సేవకు కృషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.