అలియాస్ రుక్మిణి డిసెంబర్‌లో వస్తున్నాడు

10-10-2026 | 05:25am

నేచురల్ స్టార్ నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్‌లో (Unanimous Productions)మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తు న్నారు. ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాత. సాయికుమార్, హర్షవర్ధన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న.

ఈ ప్రాజెక్టు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. డిసెంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సినిమాలో కృష్ణ అనే పాత్రలో కనిపించనున్న నితిన్.. రిలీజ్ డేట్ పోస్టర్‌లో కోర్టు ప్రాంగణంలో జనాల మధ్య నిలబడి, ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు హీరోయిన్ సిల్హౌట్ కథలోని మిస్టరీని మరింత పెంచుతోంది.

కొన్ని నిజాలను బటయపెట్టకుండా ఉండటమే మంచిదనే పరిస్థితుల్లో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే సాధారణ వ్యక్తి ప్రేమలో పడటం.. అనూహ్యంగా ఓ రహస్యం బయటపడటం.. అతను నమ్మిన ప్రతీదీ తలకిందులు కావడం వంటి అంశాలతో రూపుదిద్దుకుంటోందీ సినిమా. ప్రేమ, దాగి ఉన్న నిజాల చుట్టూ సాగే ఈ కథ.. సమాజం అంగీకరించే విషయాలకు, ప్రశ్నించాలనుకునే అంశాలకు మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరించనుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జోమోన్ టీ జాన్ ఐఎస్‌సీ; సంగీతం: విజయ్ బుల్గానిన్; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: సృజన అడుసుమిల్లి; నిర్మాత: దీప్తి గంటా; బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్; సమర్పణ: నేచురల్ స్టార్ నాని; రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్.

మరిన్ని వార్తలు