ఆర్మూర్‌లో శ్రీముఖి సందడి

08-10-2026 | 05:10am

చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

నిజామాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad District) ఆర్మూర్ మున్సిపల్ పట్టణ(Armoor Municipal Town) కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను(Chennai Shopping Mall) బుధవారం యాంకర్ శ్రీముఖి(Anchor Sreemukhi) ప్రారంభించారు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘నేను  మీ ఇందూరి బిడ్డను. మీ దగ్గరే ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాను. ఇందూరు జిల్లాలోని ఆర్మూర్‌లో ఇం త పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం మాట్లాడుతూ.. ఆర్మూర్ ప్రజల ఆదరణే తమకు ముఖ్యమని, గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా అన్ని వస్త్రాలపై ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు