యువతను ఆలోచింపజేసే గోట్
ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’ (GOAT) ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల నిర్మాత. ఇందులో సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేశ్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “సుడిగాలి సుధీర్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెతో నిర్మించిన చిత్రమిది. ఆయన క్రేజ్‌కు తగ్గ కథను ఎన్నుకుని ఈ సినిమా నిర్మించాను. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్; నేపథ్య సంగీతం: మణిశర్మ; డీవోపీ: రసూల్ ఎల్లోర్, సన్నీ కూరపాటి; ఎడిటర్: విజయ్ ముక్తవరపు, ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్.