కాలేజీ రోజులను గుర్తుచేసే సిన్సియర్ లవ్‌స్టోరీ ఇది
ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా రూపొం దుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్(Romantic entertainer) ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డీ అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న విడుదల కానున్న ఈ మూవీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. “ముందే ఓటీటీకి అమ్మేసి అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడం నిజంగా గ్రేట్. నెట్‌ఫ్లిక్స్ వారికీ స్టోరీ చెప్పి ఈ హైకూ తీశారంటే వాళ్లను ఈ స్క్రిప్ట్ ఎంత మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. మనల్ని మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది” అన్నారు. హీరో ఏగన్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా బాగా కష్టపడి చేశాం.
ఈ సినిమాపై నేను చాలా నమ్మకంగా ఉన్నా. 200 శాతం హైదరాబాద్‌లో మళ్లీ హైకూ సక్సెస్ మీట్లో కలుద్దాం” అన్నారు. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. “ఈ సినిమా నా మనసుకు చాలా బాగా దగ్గరయింది. కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్‌లో ఉన్నా, రిలేషన్ షిప్లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్ ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు. ఏగన్ డౌన్ టు ఎర్త్.
ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించింది” అని చెప్పింది. డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. “హైకూ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. హైకూకి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ జాబిలీ (శ్రీదేవి). ఆమెకు ఇది తమిళ్ డెబ్యూ. ఆవిడ కళ్లతో ఏ భాష అయినా మాట్లాడగలదు. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సినిమా ఔట్ పుట్ చాలా ప్లెసెంట్గా వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు” అని తెలిపారు.