నాలోన నే లేను..

06-11-2026 | 05:00am

విజయ్ ఆంటోని కొత్త సినిమా ‘నాన్న కుట్టి(Nanna Kutty)’. ము. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా నుంచి లవ్, మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.

‘నాలోన నే లేను’ అంటూ సాగే ఈ లవ్ సాంగ్ అందరినీ కట్టి పడేసేలా ఉంది. విజయ్ ఆంటోని బాణీ సమకూర్చగా, భాష్యశ్రీ రాసిన ఈ పాటను రుక్షర్ బంధుకియా పాడారు. ఈ చిత్రానికి రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా వ్యవహరించారు. ఏ రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.

మరిన్ని వార్తలు