సిద్దు సరసన!
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్ నయన్ సారిక(Nayan Sarika) ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) కథానాయకుడిగా రూపొందనున్న సరికొత్త చిత్రం ఇదే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రంలో సిద్దు సరసన కథానాయికగా నటించేందుకు నయన్ సారికను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. సిద్దు జొన్నలగడ్డ లాంటి యూత్ ఐకాన్ సరసన నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహారాష్ట్రకు చెందిన నయన్ సారిక.. టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం సరసన ‘క’ చిత్రంలో ‘సత్యభామ’గా నటించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూమరాలజీ, మూఢనమ్మకాల నేపథ్యంలో రూపొందిన ‘విష్ణు విన్యాసం’ చిత్రంలో యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన నటించి, మంచి క్రేజ్ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. నిహారిక కొణిదెల నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకాస’ ఫాంటసీ డ్రామాలో ’సుబ్బలక్ష్మి’గా నయన్ ముఖ్య పాత్ర పోషించింది.
ఈ ఏడాది ‘జీ తెలుగు అప్సరా అవార్డ్స్ ‘లక్కీ చార్మ్ ఆఫ్ టాలీవుడ్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం నయన్ సారిక టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిందని చెప్పొచ్చు. మణికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సౌండ్ ఇంజనీర్’ చిత్రంలో ఆమె సరికొత్త పాత్రలో కనిపించనుంది. వరుస హిట్లు, విలక్షణమైన పాత్రలతో దూసుకుపోతున్న నయన్ సారిక, ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో జతకట్టడం ఆమె కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించనుందని చెప్పవచ్చు. నవంబర్ 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.