ధర్మన్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) ‘ధర్మన్’ సినిమాలో(Dharman Film) లేడీ సూపర్‌స్టార్ నయనతార(Lady Superstar Nayanthara) కూడా నటించబోతున్నట్టు మేకర్స్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రజనీకాంత్(Rajinikanth), నయనతార మరోసారి జతకట్టడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సమర్పణలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కమల్ హాసన్(Kamal Haasan), ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో(First Look) సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇందులో రజనీకాంత్ ఓ మిస్టీరియస్ డాక్టర్‌గా, చేతిలో రక్తపు మరకలున్న స్కాల్పెల్తో ‘ది డెడ్లీ డాక్టర్’ అనే విభిన్నమైన అవతార్‌లో కనిపించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రజనీకాంత్, నయనతార భారీ కిటికీ ముందు ఎదురెదురుగా నిలబడి కనిపించారు. కిటికీ నుంచి ప్రసరిస్తున్న బంగారు కాంతి మధ్యలో వారి సిల్హౌట్స్ ఆకట్టుకుంటున్నాయి. రజనీకాంత్, నయనతార కలిసి నటించడం ఇది ఐదోసారి. గతంలో వీరిద్దరూ ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘దర్బార్’, ‘పెద్దన్న’ సినిమాల్లో కలిసి నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.