డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలి పోరాటం ఆగదు
కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి
ఎన్జీటీ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలి
ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
ఏదులాబాదులో ఈటల పాదయాత్ర ప్రారంభం
మేడ్చల్/ఘట్కేసర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డును(Jawaharnagar Dumping Yard) పూర్తిగా మూసివేసి శాశ్వతంగా తరలించే వరకు న్యాయమైన ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(Ramchander Rao) హెచ్చరించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawaharnagar Dumping Yard) వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన నిలిచి, యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు.
గతంలో కొంపల్లి మోహన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(National Green Tribunal) (ఎన్జీటీ)లో కేసు వేసినప్పుడు, డంపింగ్ యార్డును తరలించ డంతో పాటు శాస్త్రీయంగా క్యాపింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ క్యాపింగ్ ప్రక్రియ ఏమైందో, నిబంధనలు ఎందు కు అమలు కావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ ఘట్కేసర్ మండ లం ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరు వు వద్ద మంగళవారం ఎంపీ ఈటల రాజేందర్ ‘ఛలో జవహర్‌నగర్’ పేరిట మహా పాదయాత్రను ప్రారంభించారు. దీనికి రాంచందర్‌రావు సంపూర్ణ సంఘీభావం తెలిపారు.
ఎంపీ ఈటల మాట్లాడుతూ.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరి ష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నాలు గు రోజులు 60 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించామన్నారు. డంపిం గ్ యార్డ్ నుంచి వెలువడే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజలకు శ్వాసకోస, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని, తాజాగా ఏదులబాద్కు చెందిన ఒక మహిళ క్యాన్సర్ బారిన పడి మంగళవారం మరణించింది అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయమై ఎన్జీటీలో, సుప్రీంకోర్టులో కేసు వేశారని, సీఎంగా పదవి చేపట్టి మూడేళ్లు గడిచినప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. అఖిలపక్ష నాయకులమంతా కలిశామని ఇప్పటివరకు ఎలాంటి పరిష్కార మార్గం దొరకలేదన్నారు. కొట్లాడే బిడ్డకు, ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని భావించి ఇక్కడి ప్రజలు రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపించారని, కానీ ఆయన ఈ ప్రాంతాన్ని, ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, చెత్తను అనేక రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. పాదయాత్రలో బాధితులు అందరూ పాల్గొని తమ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు మొదటి రోజు అనూహ్య స్పందన లభించింది. మత్స్యకారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.
ఒక్క నిమిషం కూడా నివసించలేరు: రాంచందర్‌రావు
స్థానిక చెర్యాల, ఏదులాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం, దుర్గంధం వల్ల ప్రజలు ఒక్క నిమిషం కూడా నివసించలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, భూగర్భ జలాలు విషతుల్యమై కలుషిత నీటి కారణంగా ఏదులాబాద్ చెరువులోని చేపలను మార్కెట్లో ఎవరూ కొనుగోలు చేయని దయనీయ పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య ప్రభావం కేవలం స్థానికంగానే కాక జూబ్లీహిల్స్, తార్నాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు.
దీనివల్ల ఈ ప్రాంతంలో అనేక దుష్పరిణామాలు ఉన్నాయని, ప్రజలు స్వచ్ఛమైన గాలి తీసుకోలేకపోతున్నారని, నీరు తాగలేకపోతున్నారని అన్నారు. జవహర్‌నగర్ విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా తరలించే వరకు ఈ న్యాయమైన ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, విచ్ఛిన్నకర విధానాలను ఎండగడుతూ ఎస్ఐఆర్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు చైతన్యం కల్పించేలా నవంబర్ 2వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహా పాదయాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్, అర్బన్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, గిరి వర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పట్లల్ల విక్రంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బండి కార్తిక రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, వీరేందర్ గౌడ్, తాడూరి శ్రీనివాస్, కొంపల్లి మోహన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.