ట్రంప్ నన్ను రేప్ చేశారు!

28-10-2026 | 05:30am

వీసా, వర్సిటీలో సీటు ఇప్పిస్తానని అఘాయిత్యం

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఆరోపణ

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల నివేదిక

వాషింగ్టన్, అక్టోబర్ 27: వీసా, న్యూయార్క్ యూనివర్సిటీలో(Visa, New York University) తనకు సీటు ఇప్పిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తనపై అత్యాచారం(Rape) చేశారని మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్(Former Miss Switzerland Beatrice Keul) సంచలన ఆరోపణలు చేశారు. 33 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో జరిగిన అందాల పోటీల్లో(Beauty Pageant) ఈ ఘటన జరిగినట్లు ఆమె తాజాగా ఆరోపించారు. డెమోక్రటిక్ పార్టీ రూపొందించిన ఒక నివేదికలో ఈ ఆరోపణలను పొందుపరచడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ రోపణలను వైట్‌హౌస్ ఖండిస్తూ.. రాజకీయ ప్రయో జనాల కోసం డెమోక్రాట్లు నిరాధార విమర్శలు చేస్తున్నారని మండిపడింది. అయితే అమెరికా మధ్యంతర ఎన్ని కలకు మరో వారం రోజులే గడువు ఉండటంతో ట్రంప్‌పై ఈ అత్యాచార ఆరోపణల తో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ట్రం ప్‌నకు ఈసారి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. 1993 నవంబర్‌లో అందాల పోటీ కార్యక్ర మం సందర్భంగా ట్రంప్ కలిసిన క్యూల్.. వీసా, న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రవే శం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారని ఆ రోపించినట్లు నివేదిక వెల్లడించింది.

అనంత రం హోటల్‌లోని పై అంతస్తుకు పిలిపించి తనపై రేప్ చేశారని ఆమె పేర్కొన్నట్లు తెలిపింది. ట్రంప్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత జెఫ్రీ ఎఫ్‌స్టీన్ తనను సంప్ర దించి, తాను ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడినని, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. మార్-ఎ-లా గోలో జరిగే పార్టీకి తనను ఆహ్వానించారని క్యూల్ ఆరోపించినట్లు చె ప్పింది. 2024లోనూ ట్రంప్ తనను ముద్దు పెట్టుకుని, దుస్తులు పైకి లేపేందుకు ప్రయత్నించారని, అసభ్యంగా తాకారని ఆమె ఆరోపించారు.

అయితే, అప్పట్లో ఆమె అత్యాచారం జరిగినట్లు వెల్లడించలేదు. ట్రంప్‌పై లైంగిక వేధింపులు, అత్యా చార ఆరోపణలు చేసిన మరో నలుగురు మహిళల వాంగ్మూలాలను కూడా తాజా నివేదికలో ప్రస్తావిం చారు. ప్లాజా హోటల్‌లో జరిగిన అందా ల పోటీలను యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగించుకున్నారని డెమో క్రాట్లు ఆరోపించారు.

ఎప్టాన్ లేదా ఘిస్లేన్ మాక్స్‌వెల్ ద్వారా కొందరు మహిళలను ట్రంప్ వద్దకు పంపేందుకు ప్రయత్నించారనే ఆరోప ణలు కూడా ఉన్నాయని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు జేమీ రాస్కిన్ తెలిపారు. ఈ కుట్రలు ట్రంప్‌పై పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, నవం బర్ 3న జరగనున్న కాంగ్రెస్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డెమోక్రాట్లు చేస్తున్న అసత్య ప్రచారమని రిపబ్లికన్ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు విమర్శించారు. 

ఎన్నికలకు మరో వారం రోజులే గడువు..

అమెరికా మధ్యంతర ఎన్నికలకు మరో వారం రోజులే గడువు ఉండటంతో రాజకీ యం వేడెక్కింది. నవంబర్ 3న ఎన్నికలు ఉ న్న నేపథ్యం లో మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ అత్యాచార ఆరోపణలు అమెరికాలో పెనుదుమారం రేపుతున్నాయి. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎఫ్‌స్టీన్ తో ట్రంప్ సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తునకు డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహా రం ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లి కన్ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలవచ్చని ప్రధాన సర్వేలు పేర్కొంటున్నాయి. సెనేట్లో మాత్రం హోరాహోరీ తప్పదని అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో డెమొక్రాట్లు స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క టంప్ ప్రజాదరణ 38 శాతంకి పడిపోయినట్లు సమాచారం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యూల్ ఆరోపణలు కూడా ఆయన పార్టీ ఓటమికి కారణం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమా రు 3 కోట్ల మంది ఓటర్లు తమ ముందస్తు ఓటింగ్ హక్కును వినియోగించు కున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభ లేదా సెనేట్‌లో గనుక రిపబ్లికన్ పార్టీ అధికారాన్ని కోల్పోతే, ట్రంప్ తన మిగిలిన రెండేళ్ల పదవీ కాలంలో తన విధానాలను, అజెండాను అమలు చేయడం అత్యం త క్లిష్టతరంగా మారడం తప్పని పరిస్థితి ఎదురవుతుంది.

మరిన్ని వార్తలు