అర్నాబ్ బుగులు
ముంచుకొస్తున్న తుఫాన్.. నేటి తెల్లవారుజామున తీరం దాటే అవకాశం
- హుదూద్‌ను మించి బీభత్సం సృష్టించొచ్చని అంచనా
- ఏపీ, ఒడిశా తీరం వెంట హై అలర్ట్
- పలు రైళ్లు, విమానాలు రద్దు
- అధికారులకు, ఉద్యోగులకు సెలవులు క్యాన్సిల్
- ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు
- తుఫాన్ తీరం దాటే సమయంలో 150 కి.మీ. వేగంతో వీచనున్న గాలులు
- అతి భారీ వర్షాలకు అవకాశం.. తెలంగాణపైనా ప్రభావం
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: అర్నాబ్ తుఫాన్(Cyclone Arnab) తీవ్ర రూపం దాలుస్తున్నది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా(AP, Odisha) తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో అధికార యంత్రాం గం అప్రమత్తమైంది. పలు రైళ్లు, విమానాలను రద్దు(Trains and flights cancelled) చేశారు. అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు(government employees) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవుల ను క్యాన్సిల్ చేశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు విశాఖపట్నానికి 170 కిలో మీటర్ల దూరంలో, కాకినాడకు 90 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది.
ఇది గంటకు 20 కి.మీ. వేగంతో దూసుకొస్తున్నదని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున బాపట్ల - విశాఖతోపాటు యానాం వ ద్ద తీరం దాటొచ్చని అంచనా వేసింది. 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్ కంటే తీవ్రంగా అర్నాబ్ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. హుదూద్ తుఫాన్ దాటికి అప్పట్లో ఏపీ భారీగా నష్టపోయింది. అర్నా బ్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ, ఒడిశాలో ఈదురుగాలులు, వర్షాలు
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికి తీర ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ తీరం దాటే క్రమంలో 150 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. మ త్స్యకారులను వేటకు వెళ్లకుండా అధికారులు కట్టడి చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సోమవా రం రాత్రి నుంచి ఏపీలోని విశాఖ, మాల్కాపురం, యారాడ, భీమిలి, కాకినాడ, నంది గాం, ఉప్పాడ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కూడా భారీ వర్షాలు ప డ్డాయి. వర్షాలకు తోడు ఈదురుగాలుల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఇండ్లు కూడా కూలిపోయాయి. ఒడిశాలోని ఖోర్దా జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హై అలర్ట్..
పలు రైళ్లు, విమానాలు రద్దు
అర్నాబ్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై తీవ్రం గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతంలో ఏపీలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుఫాన్ కంటే ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉండొచ్చని భావిస్తున్నది. దీంతో మూ డు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ము ఖ్యంగా ఏపీలోని తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే వర్షాలు, ఈదురుగాలులతో జనం వణికిపోతున్నారు. తీరం దాటే సమయానికి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత భయపడుతున్నారు.
తీరం వెంట ఉన్న జిల్లాల్లో స్కూళ్లకు, కాలేజీలకు ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్ర కటించింది. అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. క్యాంప్ ఆఫీసులో ఆయన సమీక్షించారు. ప్రాణ, ఆస్తి న ష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూ మ్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పలు రూట్లలో 55 రైళ్లను సౌత్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. పరిస్థితిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్షించారు. సుమారు 600 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ విషయంలో అలర్ట్ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన పలు విమానాలను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రద్దు చేసింది. ముఖ్యంగా చెన్నై విజయవాడ, బెంగళూరు విజయవాడ విమానాలు రద్దయ్యాయి. ఏపీ, ఒడిశా, తెలంగాణ, చత్తీస్‌గఢ్, యానాంలో 31 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డీఐజీ షాహెదీ వెల్లడించారు. ఏపీలో 12, ఒడిశాలో 9, చత్తీస్‌గఢ్‌లో 4, తెలంగాణలో 3, యానాం లో 2 బృందాలను అలర్ట్ చేశామని తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
బుధవారం ఉదయం అర్నాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో ఆ ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు నాలుగు రోజులు వర్షాలు ఉంటాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలోనూ తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలిపింది.