ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి (Empress of Music, Singer, and Bharat Ratna M.S. Subbulakshmi) జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేశ్, బన్నీ వాస్. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Tollywood director Gowtam Tinnanuri) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మంగళవారం ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించారు. చెన్నులోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ చేశారు.
తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రష్మిక.. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో నటించబోతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో జోష్ నింపింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్ సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.