గుండెపోటుతో మార్కెట్ డైరెక్టర్ మృతి...
కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు..
ఉట్నూర్, సెప్టెంబర్ 29 ( విజయక్రాంతి ): ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిడం జంగు(52) (Agricultural Market Committee Director Sidam Jangu)గుండెపోటుతో వైద్యం పొందుతూ మృతి చెందారు. ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామానికి చెందిన సిడం జంగు కాంగ్రెస్ కార్యకర్తల నుండి నాయకుడుగా ఎదుగుతున్న సమయంలో సోమవారం గుండెపోటు వచ్చింది. వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తీసుకువెళ్లారు.
ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాదులోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో వైద్యం పొందుతూ.. మంగళవారం ఒంటిగంట సమయంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సీడం జంగు గుండెపోటుతో మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా మారింది. కాంగ్రెస్ పార్టీలో గత రెండు దశాబ్దాలుగా కార్యకర్తగా పనిచేస్తూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తన వంతు కృషి చేశారు.
సిడం జంగు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గుర్తించి ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియామకం చేయించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, కాంగ్రెస్ నాయకులు తీవ్ర దిగ్రాంత్రిని వ్యక్తం చేశారు.