రైతులకు దసరా కానుక ఇవ్వండి

29-09-2026 | 05:05pm

తరిగొప్పుల లిఫ్ట్ ను వెంటనే పూర్తి చేయండి : ఎమ్మెల్యే పల్లా

తరిగొప్పుల, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేసి దసరా పండుగ నాటికి రైతులకు సాగునీరు అందించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తరిగొప్పుల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మండలానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తరిగొప్పుల లిఫ్ట్ కు మోటార్లు చేరుకున్నాయని, ప్రస్తుతం బిగింపు పనులు, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ విషయంపై జివిఆర్  సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో చర్చించానని, పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించినట్లు చెప్పారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మొదటి జాబితాలో ఎల్2, ఎల్3 కేటగిరీలను క్షుణ్ణంగా పరిశీలించి, గ్రామాల్లో సర్పంచ్ లు గుర్తించిన నిజమైన నిరుపేదలకే ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో,ఎమ్మార్వో మోసిన్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, సర్పంచ్ కుర్రే మల్లయ్య, చిలువేరు లింగం, బై కాని బాలరాజ్, రవి, రాజు, సుధీర్, సర్పంచులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు