నవంబర్ 15న చలో నల్గొండ: ఏఐకేఎస్

13-11-2026 | 02:31pm

వెంకటాపురం,(విజయకాంతి): నవంబర్ 15 నుండి 18 వరకు జరిగే అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలను(All India Farmers Union National Conference) జయప్రదం చేయాలని రైతు సంఘం మండల కార్యదర్శి కంటెం సత్యం శుక్రవారం నాడు ఏఐకె ఎస్ 36వ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ...  ఈ మహాసభలను రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు మొక్కజొన్న పత్తి పాలు వంటి ఉత్పత్తులు సుంఖాలు లేకుండా దిగుమతికి అవకాశం ఇచ్చి ఈ దేశ రైతులను తీవ్రంగా దెబ్బతిస్తున్నానని పేర్కొన్నారు.

పార్లమెంటులో మద్దతు ధర చట్టం తెస్తానని రైతులకు హామీ ఇచ్చి నేటికీ ఆ చట్టం తేలేదు స్వామినాథన్ . సిఫారసులు అమలు చేయడం లేదు ఈ మహాసభలలో రైతుల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రైతులందరికీ రుణమాఫీ చేయాలని పార్లమెంట్లో మద్దతు ధర చట్టం అమలు చేయాలని రైతులు పండించిన పంటకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని 60 ఏళ్లపై పడ్డ రైతులకు పదివేల పెన్షన్ నెలకు ఇవ్వాలని విద్యుత్తు సంస్కరణలు నిలుపు చేయాలని రైతులందరికీ విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి.

ఇంకా రైతు నేర్పుతున్న నకిలీ విత్తన సమస్య వంటి  అనేక అంశాలు ఈ మహాసభలలో చర్చిస్తామని పేర్కొన్నారు. రైతులందరూ 15 జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం  ఆదినారాయణ . నాయకులు తోట నాగేశ్వరరావు. రైతు సంఘం మండల అధ్యక్షలు, కంటి వెంకయ్య.  చింటు.నాయకులు కట్ల నరసింహాచారి .తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు