కాంగ్రేస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

18-11-2026 | 06:12pm

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి రాంబాబు

కన్నాయిగూడెం, నవంబర్ 18(విజయక్రాంతి): మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్(DCC President Paidakula Ashok) సూచనల మేరకు కన్నాయిగూడెం మండల(Kannayigudem Mandal) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో(Mandal Congress Party Office) మండల అధ్యక్షులు జాడి రాంబాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంను బుధవారం రోజున ఏర్పాటు చేశారు.ఇటీవల నూతనంగా ఎన్నికైన నూతన మండల కమిటీ నాయకులకు శుభాకాంక్షలు,అభినందనలు తెలియజేసి అందరం ఐక్యతతో కలిసి కట్టుగా పని చేసి పార్టీ అధిష్టానం మేరకు ఎవరు కూడా హద్దులు దాటకుండా పార్టీ కోసం పని చేయాలన్నారు.

ఈ సందర్బంగా జాడి రాంబాబు గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో జరుతునటువంటి ప్రజా సంక్షేమ పథకాలు(Welfare Schemes) గుర్తు చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని మండల నాయకులకు పలు సూచనలు చేసారు.అదేవిధంగా ప్రభుత్వ పథకాలు పట్ల ఎవరైనా అర్హులైన ప్రతి పథకం ప్రజలకు వర్తించేలా చూడాలన్నారు.ఎవరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మంత్రి సీతక్క  ఆధ్వర్యంలో పార్టీ కోసం పని చేసి అందరు ఐక్యతతో పని చేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, నూతనంగా ఎన్నికైన కాంగ్రేస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రేస్ నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్లు,సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ నాయకులు, గ్రామాల సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు