దోమల మందు పిచికారీ
13-11-2026 | 05:06pm
ఏటూరునాగారం /కన్నాయిగూడెం, నవంబర్ 13(విజయక్రాంతి) : శుక్రవారం రోజున ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టాపో(ITDA Project Officer Lenin Vatsal Toppo) ఆదేశాల మేరకు ఐటీడీఏ ఏజెన్సీ డిప్యూటీ డియంహెచ్ఓ కోరం క్రాంతికుమార్(ITDA Agency Deputy DM&HO Koram Kranthi Kumar) ఆధ్వర్యంలో కొండాయి పరిధిలోని కొండాయి, మల్యాల, దొడ్లకోతురు గ్రామాలలో దోమల మందు పిచకారి చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలం మానస,ఉపసర్పంచ్ పాయం సుబయ్య, హెల్త్ ఆసిస్టెంట్ భాస్కర్ రావు, ఏఎన్ఎం సమ్మక్క,లోకల్ ఆశలు లక్ష్మి, జ్యోతి, భాగ్య లక్ష్మి, సునీత పాల్గొన్నారు.