మల్లంపల్లిలో నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
విద్యుత్ ఉపకేంద్రం సామర్థ్యం పెంపు
ములుగు, నవంబర్ 27 (విజయక్రాంతి): ములుగు ఆపరేషన్ సర్కిల్(Mulugu Operation Circle) పరిధిలోని మల్లంపల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ లోడ్ అధికంగా ఉండటాన్ని గుర్తించి, ఎల్‌నినో వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పాత పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 8 ఎంవీఏ సామర్థ్యం కలిగిన నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం ములుగు సర్కిల్ ఎస్ఈ బేతి బిక్షపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ విద్యుత్ ఉప కేంద్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను లోడ్ కు అనుగుణంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. ఈ సామర్థ్య పెంపుతో విద్యుత్ ఉపకేంద్రంపై అధిక లోడ్ సమస్య తగ్గడంతో పాటు, వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఆపరేషన్ డీఈ కన్నా రాజు భూపాలపల్లి ఎంఆర్‌టీ అండ్ కన్స్ట్రక్షన్ డీఈ, ఏడీఈలు, ఏఈలు, ఆపరేషన్, ఎంఆర్‌టీ సిబ్బంది పాల్గొన్నారు.