రామప్ప పరిరక్షణపై ఎన్‌జీటీ సుమోటో విచారణ అభినందనీయం
వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం, రామప్ప చెరువు సమీపంలో ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలతో పొంచి ఉన్న ముప్పుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సుమోటోగా విచారణకు స్వీకరించడం హర్షణీయమని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి వెంకట రామమోహన్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణుల సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్‌లకు కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప ఆలయం, చెరువు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాన్ని ఎన్‌జీటీ విచారణకు స్వీకరించడం వారసత్వ సంపద సంరక్షణ దిశగా కీలక పరిణామమని పేర్కొన్నారు.