ఘనంగా వాడబలిజ జెండా ఆవిష్కరణ
వాడబలిజ కులస్తులకు ప్రభుత్వాలు గుర్తింపు కల్పించి న్యాయం చేయాలి
రాష్ట్ర అధ్యక్షులు దామోదర్
వెంకటాపురం,(విజయక్రాంతి): వెంకటాపురం మండల కేంద్రంలోని వి.ఆర్.కె. పురం గ్రామపంచాయతీ పరిధిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడబలిజ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాడబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున రావు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరికీ వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతానికి ఇరువైపులా అధిక సంఖ్యలో నివసిస్తున్న వాడబలిజ కులస్తులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. లక్షలాది జనాభా కలిగిన వాడబలిజ కులస్తులకు ప్రభుత్వాల నుంచి తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కొప్పుల మల్లయ్య, వాధం వెంకన్న, సనుగుండ వెంకన్న, బోగట నరసింహారావు, కొప్పుల మల్లికార్జున్, సారయ్య, సూర్యం, వెంకటేష్, రమేష్, పోతురాజు, విజయ్, నాగార్జున, ప్రసాదు, రవిచంద్రమూర్తి, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.