రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలి

30-10-2026 | 05:34pm

అచ్చంపేట, అక్టోబర్ 30:  రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్(Achampet DSP Srinivas) పోలీస్‌ సిబ్బందికి సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ వార్షిక తనిఖీలో భాగంగా పెండింగ్‌ కేసులను త్వరిత గతిన పరిష్కరించాలని, బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, రిసెప్షన్‌, రైటర్‌ విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఐ నాగరాజు, ఎస్సై నరేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు